పూర్ణానంద రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

పూర్ణానంద రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు
అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు.

పూర్ణానంద రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్‌ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. ఏడాదిగా అత్యాచారం చేయడంతో మరో బాలిక గర్భం దాల్చినట్లు పేర్కొన్నారు.పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని డీఎస్పీ వివేకానంద తెలిపారు. బాలికలు గర్భం దాల్చకుండా ట్యాబ్లెట్స్‌ ఇచ్చేవాడన్నారు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నట్లు తెలిపారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో వెల్లడైనట్టు స్పష్టం చేశారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు.ఇక జూలై 5 వరకు పూర్ణానందకు కోర్టు రిమాండ్ విధించింది.

Tags

Read MoreRead Less
Next Story