Crime News: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మాధవిని తన భర్త గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు ఉన్నారని.. అందులో ఓ మహిళ ఉన్నట్లు భావిస్తున్నారు. నిందితుడు గురుమూర్తిని 5 రోజులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు సహకరించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఓ ప్లాన్ ప్రకారం గురుమూర్తి ఆమెను హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. దీంతో ఈ హత్యకు సహకరించిన చెల్లెలు సుజాతను A2 గా, తల్లి సుబ్బలక్ష్మిని A3 గా, తమ్ముడు కిరణ్ A4 గా రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు చేర్చినట్టు సమాచారం. మృతురాలి భర్త గురుమూర్తి ఈ హత్యలో A1గా ఉన్న విషయం తెలిసిందే. విచారణలో పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడిపై హత్యకు సంబంధించి సెక్షన్లు నమోదు చేయగా.. మిగిలిన ముగ్గురిపై బీఎన్‌ఎస్‌లోని 85 సెక్షన్(గృహహింస) ప్రయోగించారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com