Bhuvangiri District : పదేళ్ల అనాథ బాలికపై అత్యాచారం

Bhuvangiri District : పదేళ్ల అనాథ బాలికపై అత్యాచారం
X

పదేళ్ల బాలికపై ఓ నీచుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన భువనగిరి జిల్లా‌ కేంద్రంలోని బాలసదన్‌లో చోటు చేసుకుంది. అనాథ బాలికపై జిల్లా లీగల్ సర్వీసెస్‌కు చెందిన అటెండర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 14న బాలసదన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‌ఈ కార్యక్రమానికి డీసీపీఓతో పాటు మరికొందరు హాజరయ్యారు. అదే కార్యక్రమానికి నిందితుడు కూడా డీసీపీవోతో పాటు వచ్చాడు. అదే సమయంలో ఓ బాలిక రూమ్‌లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.‌ అదే విషయాన్ని ఏడుస్తూ వచ్చి విషయాన్ని బాలసదన్ సిబ్బందికి చెప్పింది. అయిన కూడ వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.‌ విషయం బయటకు వస్తే అందరూ ఉద్యోగాలు పోతాయంటూ అందులోని ఓ అధికారి హెచ్చరించినట్లు తెలుస్తోంది. విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు బాధితురాలిని భువనగిరి బాలసదన్ నుంచి వలిగొండలోని ఒక ప్రైవేటు అనాథాశ్రమానికి తీసుకువెళ్లారు. అనంతరం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.‌ దీనిపై ఫిర్యాదు రావడంతో భువనగిరి పట్టణ పోలీసులు ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story