Bihar : బిహార్‌లో దారుణం.. థర్డ్ క్లాస్ స్టూడెంట్‌ను కాల్చిన ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్

బీహార్లో దారుణం జరిగింది. నర్సరీ విద్యార్థి స్కూల్లో తుపాకీతో హల్చల్ చేశాడు. ఓ విద్యార్థిపై కాల్పులకు తెగబడ్డాడు. చేతికి బుల్లెట్ తగలడంతో హుటాహుటినా పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యం షాక్ కు గురైంది.
సుపాల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల నర్సరీ విద్యార్థి స్కూల్ బ్యాగ్ లో తుపాకీ తీసుకొచ్చాడు. పాఠశాలకు వచ్చాక.. 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. దీంతో చేతికి బుల్లెట్ తగలడంతో సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. పాఠశాలకు వచ్చి సంఘటనాస్థలిని
పరిశీలించి.. తుపాకీ, బుల్లెట్ను స్వాధీనం చేసుకున్నారు.
అసలు బాలుడు స్కూల్ కు తుపాకీ ఎలా తీసుకొచ్చాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా స్కూల్ యాజమాన్యం తీరుపై కూడా పోలీసులు మండిపడ్డారు. స్కూల్ ప్రిన్సిపాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంత పెద్ద నిర్లక్ష్యం ఎలా జరిగిందంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే కాల్పులు జరిపిన విద్యార్థి తండ్రి ఎవరు.. ఆయన ఎక్కడున్నాడనేది కూడా ఆరా తీస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com