షాకింగ్ న్యూస్: మైనర్ బాలిక పాఠశాల బాత్రూమ్‌లో ప్రసవం.. శిశువు మృతి.. బాలిక పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తపట్నంకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక తరగతులు జరుగుతున్న సమయంలో పాఠశాల బాత్‌రూమ్‌లో ప్రసవించిన విషాద సంఘటన జూలై 31 బుధవారం నాడు జరిగింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలులోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స కోసం తరలించారు. అయితే, నవజాత శిశువు పుట్టిన కొద్దిసేపటికే మరణించింది.
మైనర్ బాలిక కొత్తపట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థిని, చీమకుర్తి మండలంలో నివసిస్తోంది. గర్భవతి అయినప్పటికీ, ఆమె పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతుందని, ఆమె గర్భం దాల్చిన విషయం పాఠశాల అధికారులకు గానీ, ఉపాధ్యాయులకు గానీ తెలియదు.
బుధవారం బాలికకు ప్రసవ నొప్పి రావడంతో వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆమె తన బాధను ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత పాఠశాల సమయంలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని గంటలపాటు బాలిక క్లాస్‌లో కనిపించకుండా పోయిందని గమనించిన సహవిద్యార్థులు ఆమె కోసం వెతుకుతుండగా వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు.
దీంతో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించగా విద్యార్థినిని అత్యవసరంగా ఒంగోలులోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com