Shraddha Walker: రంపంతో కోసేశాడు.....

గత సంవత్సరం జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే మరిన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్ధా వాకర్ ను అతి దారుణంగా హత్య చేసిన అఫ్తాబ్ పూనావాలా ఆమె శరీరాన్ని ముక్కలు చేయడానికి రంపాన్ని ఉపయోగించాడని శవపరీక్షలో వెళ్లడైంది. ఎయిమ్స్ లో నిర్వహించిన పోస్ట్ మార్టమ్ లో ఈ విషయం తెలిసింది.
మృతదేహాన్ని నరకడానికి ఉపయోగించిన రంపాన్ని, శరీర భాగాలను ఆఫ్తాబ్ గురుగ్రామ్ లోని పొదల్లో విసిరేసినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని భాగాలను డిల్లీలోని డస్ట్ బిన్లలో పడవేసినట్లు చెప్పారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికల ప్రకారం, దక్షిణ ఢిల్లీలోని మోహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి ఛిద్రమైన ఎముకలను పోలీసులు వెలికి తీయగా... అవి శ్రాద్దా వాకర్ తండ్రి DNAతో సరిపోలాయి.
ఢిల్లీ పోలీసులకు అఫ్తాబ్ పాలిగ్రాఫ్, నార్కో పరీక్షకు సంబంధించిన వివరణాత్మక నివేదిక కూడా అందింది. శ్రద్దా వాకర్ శరీర భాగాలను వెతుకుతున్న సమయంలో, మొదటగా 13 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శ్రాద్దా వాకర్ తో సహాజీవనం చేస్తున్న అఫ్తాబ్... మే 18, 2022న గొంతుకోసి చంపిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఆమె శరీర భాగాలను భద్రపరచడానికి ప్రత్యేకంగా 300-లీటర్ల ఫ్రిడ్జ్ కొని, దాదాపు మూడు వారాల పాటు అదే ఫ్రిడ్జ్ లో భద్రపరిచాడు. వాటిని ప్రతీ రోజు నగరం అంతటా పడవేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నవంబర్ 12న అఫ్తాబ్ ను అరెస్ట్ చేసి ఐదు రోజులు పోలీసు కస్టడీకి పంపించారు. ఆపై నవంబర్ 17న ఐదు రోజుల కస్టడీని పొడిగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com