Shravan Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్ రావు హాజరు

Shravan Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్ రావు హాజరు
X

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ6 శ్రవణ్‌రావు ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పీఎస్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. తొలుత లండన్ అక్కడి నుంచి అమెరికా వెళ్లి సిట్ విచారణకు రాకుండా తప్పించుకున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రవణ్‌రావుకు ఊరట లభించింది. ఆయన్ను ముందస్తుగా అరెస్టు చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని శ్రవణ్‌రావుకు స్పష్టం చేసింది.

ఈ క్రమంలో శ్రవణ్‌రావు విచారణకు హాజరు కావాలని ఈ నెల 26న సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దేశం రప్పించేందుకు ఇటీవల రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు.

Tags

Next Story