కీచక ఎస్సై చేతిలో అత్యాచారం గురైన ట్రైనీ ఎస్సై

SI Molested Trainee SI: మహబూబాబాద్ జిల్లాలో ఓ ఎస్సై కీచకుడిలా మారాడు. ట్రైనీ ఎస్సైపైనే బలాత్కారానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఊహించని పరిణామంతో షాక్‌కి గురైన బాధితురాలు.. ప్రతిఘటించినా అతని చేతుల్లోంచి తప్పించుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయంపై వరంగల్ సీపీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సైగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం చేయకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటున్న ట్రైనీ ఎస్సై కన్నీరు పెడుతోంది. దళిత యువతి కావడమే తమ కుమార్తె చేసుకున్న పాపమా అంటూ.. ఆమె కుటుంబ సభ్యులు కూడా భోరున విలపిస్తున్నారు. పోలీసు శాఖలోనే ట్రైనీ ఎస్సైపై ఎస్సై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో.. ఉన్నతాధికారులు కూడా దీన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com