NRIని హత్య చేసేందుకు YCP నేతల స్కెచ్‌

NRIని హత్య చేసేందుకు YCP నేతల స్కెచ్‌
దాదాపు రూ.100 కోట్ల విలువైన ఈ భూముల్ని కబ్జా చేసేందుకు ఏకంగా NRIని హత్య చేసేందుకు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది.

విజయవాడ శివారులో ఉన్న కానూరు ట్రస్ట్‌ భూముల కబ్జా చేసుకునేందుకు తీవ్ర యత్నిస్తున్నారు వైసీపీ నేతలు. దాదాపు రూ.100 కోట్ల విలువైన ఈ భూముల్ని కబ్జా చేసేందుకు ఏకంగా NRIని హత్య చేసేందుకు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కిరాయి మూకను రంగంలో దించారు. నిన్న రాత్రి హైకోర్టు ప్రాంగణం వద్ద ఎన్నారై హత్యకు స్కెచ్‌ గీశారు. ఎన్నారైను హత్య చేసేందుకు ప్రయత్నించిన కిరాయిమూకకు పెనమలూరు పోలీసులు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే తమ భూమిని కబ్జా చేశారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు NRI. కోర్టును ఆశ్రయించిన ఆయనపై తప్పుడు కేసును బనాయించారు వైసీపీ నేతలు. ఈ భూకబ్జాలో కర్నూలు, పెనమలూరు, విజయవాడకు చెందిన వైసీపీ నేతల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కిరాయి మూక కూడా కర్నూలు నుంచి వచ్చినట్లు సమాచారం. NRI హత్యకు ప్రణాళిక వేసిన వైసీపీ నేతలు ఆయన తరుపున కోర్టులో వాధిస్తున్న న్యాయవాది పాలేటి మహేష్‌పైనా రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. NRIకి న్యాయసహాయం అందించకుండా ఇంటివద్ద కిరాయి మూక కాపు కాసినట్లు తెలుస్తోంది.

ఓ వైపు నిన్న రాత్రి హైకోర్టులో కిరాయి మూక ఎన్నారైపై హత్యాయత్నం చేయగా ఇదే సమయంలో ఏపీ పోలీసులు శ్రీనివాస్‌రావుతో పాటు ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. యాదాద్రికి వెళ్లి వస్తున్న శ్రీనివాసరావు కుటుంబ పట్ల ఏపీ పోలీసులు దారుణంగా వ్యవహరించినట్లు సమాచారం. శ్రీనివాసరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను నిన్న ఉదయం 11 గంటలకు అదుపులోకి తీసుకుని రాత్రి 7.30 వరకు కారులోనే తిప్పినట్లు తెలుస్తోంది. శ్రీనివాసరావుతో పేపర్లపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ పోలీసుల తీరుపై పంజాగుట్ట పీఎస్‌లో ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఛైర్మన్‌ కటుంబరావు కంప్లైంట్‌ ఇచ్చారు.

ట్రస్ట్‌ భూములను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న శ్రీనివాసరావుపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబరావు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ దారుణంగా ఉందని ఏపీ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story