Hyderabad : హైదరాబాద్‌లో నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్

Hyderabad : హైదరాబాద్‌లో నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్
X

హైదరాబాద్‌ మహా నగరంలో అక్రమంగా నక్షత్ర తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తూ బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు రట్టు చేశారు... మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ, మేడిపల్లిలోని రెండు ఆక్వేరియం షాపులతోపాటు మలక్ పేట్‌లోని ఓ ఆక్వేరియం షాపులో దాడి చేసి అరవై నాలుగు లక్షల విలువ చేసే 218 నక్షత్ర, 160 రెడ్ సాలిడార్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్ పేట్‌కు చెందిన మహ్మద్ సిరాజ్‌, పీర్జాదిగూడకు చెందిన షేక్ జానీ ఆక్వేరియం షాపులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరికీ ఏపీకి చెందిన విజయ్ కుమార్ నక్షత్ర తాబేళ్లను అక్రమంగా పంపుతుండగా, వీరిద్దరూ రహస్యంగా సదరు తాబేళ్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక రేట్లకు అమ్ముతున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకుని ఉప్పల్ ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఏపికి చెందిన విజయ్ కుమార్ పరారీలో ఉన్నట్లు సమాచారం‌.

Tags

Next Story