మెడికల్ స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్

మెడికల్ స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్
X

జనవరిలో కేఫ్‌లో 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో జైపూర్ (రూరల్) పోలీసులు ఫిబ్రవరి 9న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ జైపూర్ (రూరల్) శంతను కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 9న కేఫ్‌లో ఆరుగురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఆమె స్నేహితురాలితో కలిసి నగలు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. ఆ తర్వాత కేఫ్ కి వెళ్లింది.

పరిస్థితి తీవ్రతను గుర్తించిన పోలీసులు 20 మంది సిబ్బందితో కూడిన బృందాన్ని సమీకరించి, నేరస్థలాన్ని పరిశీలించడం, సమీపంలోని హైవేలను సమీక్షించడం, 200కి పైగా CCTVల నుండి ఫుటేజీని విశ్లేషించడం వంటి సమగ్ర పరిశోధనలు చేశారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపిన పోలీసులు ఐదుగురు నిందితులను సచిన్ గుర్జార్ (19), సంజయ్ గుర్జార్ (22), లోకేష్ (20), రోహితాష్ లాల్ (25), ఓం ప్రకాష్ (24)గా గుర్తించారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నట్టు సమాచారం.

Tags

Next Story