బెంగుళూరులో దారుణం.. ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు

బెంగుళూరులో దారుణ హత్య జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆకాంక్షను ప్రియుడు ఆర్పిత్ హత్య చేశాడు. ఆకాంక్ష కోడిహల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన స్నేహితురాలితో కలిసి ఉంటోంది. హైదరాబాద్‌లో ఉన్న ఆర్పిత్ బెంగుళూరుకు వచ్చి ఆకాంక్షను కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవ చోటు జరిగిందని.... ఆ గొడవే హత్యకు దారి తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆకాంక్షను గొంతునులిమి చంపేసి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అర్పిత్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని గోదావరిఖనికి తీసుకువచ్చారు కుటుంబసభ్యులు . కన్నబిడ్డ మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆకాంక్ష, అర్పిత్ చాన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి కోడిహళ్లిలో అద్దె ఇంట్లో ఉండేవారు. తాజాగా వారిద్దరూ వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిపాదన అర్పిత్‌కు కోపం తెప్పించినట్లు గుర్తించారు. వేర్వేరుగా ఉండే అంశంపై ఇద్దరూ గొడవ పడుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సోమవారం రాత్రి ఆ ఇంట్లో గొడవ అనంతరం ఆమెను హత్య చేశాడని డీసీపీ వివరించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు... నిందితుడి కోసం పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com