క్రైమ్

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. కోరిక తీరాక కులం తక్కువన్నాడు.. సాప్ట్‌వేర్ ఉద్యోగి నిర్వాకం

ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఒకరికొకరు ఇష్టపడ్డారు. అడ్డేముందని అడ్వాన్స్ అయిపోయారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. కోరిక తీరాక కులం తక్కువన్నాడు.. సాప్ట్‌వేర్ ఉద్యోగి నిర్వాకం
X

ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఒకరికొకరు ఇష్టపడ్డారు. అడ్డేముందని అడ్వాన్స్ అయిపోయారు. ఇప్పుడేమో పెళ్లి పేరెత్తితే కులం తక్కువ అని మొహం చాటేస్తున్నాడు బీటెక్ చదివిన ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి. ఉద్యోగాల పేరుతో ఊళ్లు, దేశాలు దాటేస్తున్నారు. ఎవరో పరిచయం అవుతారు. పెళ్లికి ముందు ప్రతి పరిచయం ప్రేమగానే ఉంటుంది.

అతడే సర్వస్వం అని ఆమె, ఆమె కోసం నేనేమైనా చేస్తానని అతడు.. ఆమె ఒడిలో అతడు తలవాల్చి కబుర్లు ఎన్నో చెప్పేసుకుంటారు. భవిష్యత్ ఏ మాత్రం కళ్లముందు కనిపించదు. ఆ క్షణంలో చుట్టూ ఉన్న ప్రపంచం అందమైన ఇంద్రధనస్సులా కనిపిస్తుంది. ఆ తరువాతే అసలు విషయం బయటకు వస్తుంది.

తాజాగా గుంటూరుకు చెందిన ఓ యువతి బీటెక్ చదువుకుని బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అక్కడే ఆమెకు చిత్తూరు జిల్లా కంభంవారిపల్లికి చెందిన సహోద్యోగి పరిచయం అయ్యాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్లపాటు కొనసాగిన వారి ప్రేమలో అతడి 'కోరిక'లూ తీరాయి.

ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఎవరిళ్లకు వారు వెళ్లి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుందాం అని యువతి ఎన్ని సార్లు ఫోన్ చేసినా అట్నుంచి ఉలుకూ, పలుకూ లేదు. సరికదా మ్యాట్రమోనీలో తన వివరాలు అప్‌లోడ్ చేశాడు. అదేమని నిలదీస్తే అమ్మానాన్న ఒప్పుకోవట్లేదన్నాడు.

దాంతో యువతి తండ్రిని తీసుకుని అతడి ఊరు వెళ్లింది. తక్కువ కులం వారిని పెళ్లి చేసుకోమని అతడి కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు. ప్రేమ, పెళ్లి పేరుతో కోరిక తీర్చుకుని మోసగించిన అతడిపై చర్యలు తీసుకోమని బాధిత యువతి గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

Next Story

RELATED STORIES