క్రైమ్

NTR District: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య.. చనిపోయే ముందు తల్లికి మెసేజ్..

NTR District: ఎన్టీఆర్‌ జిల్లాలో జగయ్యపేట మండలం చిలకల్లు వద్ద చెరువులో దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

NTR District: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య.. చనిపోయే ముందు తల్లికి మెసేజ్..
X

NTR District: ఎన్టీఆర్‌ జిల్లాలో జగయ్యపేట మండలం చిలకల్లు వద్ద చెరువులో దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్వేతగా గుర్తించారు. మూడు నెలల నుంచి శ్వేత.. వర్క్ ఫ్రమ్‌ హోం చేస్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లోని ఓప్లమ్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. నిన్న సాయంత్రం మంగళగిరిలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్వేత.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లికి వాట్సప్‌లో వాయిస్‌ మెసెజ్‌ పంపింది. అంతలోనే ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీయించి పంచనామా నిర్వహించారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES