రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

రోడ్డు  ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

ట్రాఫిక్ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) మృతి చెందాడు. హైదరాబాద్‌లోని (Hyderabad) రామచంద్రపురం (Ramachandra puram) ప్రాంతానికి చెందిన రామినేని మహేశ్‌బాబు (Ramineni Mahesh Babu) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిన మహేష్ బాబు మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేశ్ మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ (Chanda Nagar Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు (Guntur) చెందిన మృతుడు రామినేని మహేష్ బాబు 8 నెలల క్రితం పని నిమిత్తం హైదరాబాద్ వచ్చి రామచంద్రాపురంలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో స్నేహితుడి వద్దకు వెళ్లి గ్యాస్ సిలిండర్ కోసం బయటకు వెళ్లాడు. అతను తన స్కూటర్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో చందానగర్ ప్రధాన రహదారిపై స్కూటర్‌పై వెళ్తున్న మహేష్‌బాబును డీసీఎం వాహనం ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి (Gandhi Hospital) తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story