కాలిఫోర్నియాలో ప్రకాశం జిల్లా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం

కాలిఫోర్నియాలో ప్రకాశం జిల్లా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం

అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ముంజ్లమూరు గ్రామానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ దొద్దాల బుచ్చిబాబు (40) మృతి చెందాడు. కాలిఫోర్నియాలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బుచ్చి బాబు వీకెండ్ కావడంతో శనివారం ఫ్యామిలీతో బీచ్ కు వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు దొద్దాల బుచ్చిబాబు శనివారం సాయంత్రం కాలిఫోర్నియాలోని బీచ్లో మునిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

ఈ సమాచారం తెలిసిన వెంటనే దర్శి నియోజకవర్గ కూటమి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి టీడీపీ నాయకులు... మృతుడి తల్లిదండ్రులు, స్థానిక నేతలు అయిన దొద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మలకు ఫోన్ చేసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అమెరికా నుంచి దొద్దాల బుచ్చిబాబు భౌతికకాయాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవలసిందిగా తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెడతానని చెప్పారు. తెలుగుదేశం కుటుంబానికి చెందిన కోటేశ్వరావు కోటేశ్వరమ్మ కుటుంబంలో ఇలాంటి దురదృష్ట సంఘటన చోటుచేసుకోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story