Vizianagaram: అత్తింట్లో అల్లుళ్లు దొంగతనం..!

X
Vijayanagaram: పిల్లనిచ్చిన అత్తింట్లోనే అల్లుళ్లు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కొమరాడలో చోటుచేసుకుంది. అక్కయ్యమ్మ అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలను సీతానగరానికి చెందిన మేనల్లుడు గణేష్‌తో పాటు సింహాచలానికి ఇచ్చి వివాహం జరిపించింది. ఇద్దరు అల్లుళ్లు ఖర్చులకు డబ్బులివ్వాలని అత్తను డిమాండ్ చేశారు.
లేవని ఆమె తెగేసి చెప్పింది. దీంతో ఆ ఇద్దరు అత్తింట్లో 8 తులాల బంగారు ఆభరణాలు, 20 లక్షల నగదు అపహరించారు. లబోదిబోమన్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు అల్లుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
