13 Aug 2022 11:36 AM GMT

Home
 / 
క్రైమ్ / Haryana: అమ్మకు...

Haryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..

Haryana: వివాహేతర సంబంధాలు అనేవి కుటుంబాల్లో చిచ్చును రగుల్చుతాయి.

Haryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..
X

Haryana: మామూలుగా వివాహేతర సంబంధాలు అనేవి కుటుంబాల్లో చిచ్చును రగుల్చుతాయి. ఇక ఇటీవల కాలంలో దీని వల్ల హత్యలు, ఆత్మహత్యలు లాంటివాటి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇక తాజాగా తన తల్లికి వివాహేతర సంబంధం ఉందేమో అన్న అనుమానంతో కన్నకొడుకే ఆమెను కడతేర్చాడు. హర్యానాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సోనా దేవి(40) అనే మహిళ కొన్నాళ్ల క్రితం తన భర్తను పోగొట్టుకుంది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ స్కూలులో విధులు నిర్వహించింది. కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగం గార్హిలో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. తనకు ప్రవేష్ (20) అనే కొడుకు ఉన్నాడు. తల్లికి దూరంగా ప్రవేశ్.. సోనీపట్‌లో ఉంటూ అప్పుడప్పుడు తనను చూడడానికి వస్తూ ఉండేవాడు.

తాజాగా సోనా దేవి ఉండే ఇంట్లో నుండి దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందడంతో పర్వేశ్.. తనను హత్య చేశాడన్న విషయం బయటపడింది. ప్రవేశ్‌పై సోనా దేవి సోదరుడు అనుమానం వ్యక్తం చేయడంతో తనను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా అసలు విషయం బయటికొచ్చింది.

ఇటీవల ప్రవేశ్.. తనను తల్లిని చూడడానికి వచ్చినప్పుడు తనకు పలుమార్లు ఫోన్లు వస్తుండడంతో తన తల్లికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు ప్రవేశ్. అందుకే ఆగస్ట్ 6న తన తల్లిని కత్తితో పలుమార్లు పొడిచి హతమార్చాడు. తన శవాన్ని మంచం కింద దాచేసి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. పోలీసులు హత్య చేసిన కత్తిని సీజ్ చేశారు.

Next Story