Warangal : తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు .. చికిత్స పొందుతూ మహిళ మృతి

Warangal : తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు .. చికిత్స పొందుతూ మహిళ మృతి
X

ఆస్తి కోసం తల్లిపై పెట్రోలు పోసి నిప్పంటించిన అమానుష ఘటన వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించిని విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో గత మూడు రోజులుగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందింది. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని సాంబయ్యవినోద (60) దంపతులకు కుమార్తె స్వరూప, కుమారుడు సతీశ్ లు ఉన్నారు. కాకతీయ టెకెల్ఫ్యాక్టరీ భూసేకరణలో భాగంగా కోల్పోయిన భూమికి రూ.40 లక్షల పరిహారం వచ్చింది. ఇందులో ఖర్చులు పోను కుమారుడికి రూ.30 లక్షలు ఇచ్చి.. మిగిలిన రూ.9 లక్ష లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో తల్లిపై పగ పెంచుతున్న కొడుకు... అర్ద రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న వినోదపై సతీశ్ పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. స్థానికుల సాయంతో సాంబయ్య మంటలను అదుపు చేసి ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఇవాళ మృతి చెందారు. నిందితుడు సతీశ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హజరుపర్చనున్నారు.

Tags

Next Story