TG : ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి

TG : ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
X

మెదక్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేశాడు. మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో యువతి చేతికి తీవ్ర గాయమైంది. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్‌కు తరలించారు. బాధితురాలు ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. యువతీపై దాడికి పాల్పడింది బెంగుళూరుకు చెందిన చేతన్‌గా పోలీసులు భావిస్తున్నారు. దాడి అనంతరం పరారయ్యాడు నిందితుడు చేతన్‌.

Tags

Next Story