Pak Spy Arrests : పాక్ స్పైగా యూపీ వ్యాపారి అరెస్టు చేసిన ఎస్టీఎఫ్

పహెల్గాం దాడి తర్వాత రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తును ముమ్మరం చేసింది. దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారవేత్తను గూఢచర్యం ఆరో పణలతో అరెస్ట్ చేసినట్లు ఎస్టీఎఫ్ ప్రకటించింది. యూపీలోని రాంపురకు చెందిన వ్యాపారవేత్త షాజాద్ పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. ఐఎస్ఐతో సంబంధాలు కొన సాగిస్తూ.. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్నిపాకు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎస్టీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. గూఢచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాక్ వెళ్లొచ్చాడని, పాక్కు సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవా డని అన్నారు. షాజాద్ భారత్లో పలు సిమ్కా ర్థాలను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు అందించేవాడన్నారు. యూపీలోని పలువురుని ఉగ్రవాదం వైపు ప్రోత్సహించినట్టు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com