హత్య చేయాలని సరదా పడింది.. క్రైమ్ వీడియోలు చూసి టీచర్ ని..

హత్య చేయాలని సరదా పడింది.. క్రైమ్ వీడియోలు చూసి టీచర్ ని..
దక్షిణ కొరియాకు చెందిన 23 ఏళ్ల జంగ్ యూ-జంగ్ అనే యువతికి క్రైమ్ షోలు చూడడం, క్రైమ్ నవలలు చదవడం ఇష్టం.

దక్షిణ కొరియాకు చెందిన 23 ఏళ్ల జంగ్ యూ-జంగ్ అనే యువతికి క్రైమ్ షోలు చూడడం, క్రైమ్ నవలలు చదవడం ఇష్టం. వాటిని చదివి, చూసి అందులో ఉన్నట్లుగానే తాను కూడా ఎవరినైనా హత్య చేయాలని భావించింది. తాతయ్యతో ఒంటరిగా ఉంటున్న ఆమె ఆన్లైన్లో ట్యూషన్ టీచర్ కోసం వెతికింది. క్లాస్ చెప్పించుకునేందుకని ఆమె ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపేసింది.

ఈ దారుణ హత్యతో దక్షిణ కొరియా ఉలిక్కిపడింది. ప్రాసిక్యూషన్ మరణశిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఇది సాధారణంగా అత్యంత తీవ్రమైన నేరాలకు రిజర్వ్ చేయబడింది. తన తాతతో నివసించిన ఒంటరి నిరుద్యోగి అయిన జంగ్, ఎవరో ఒకరిని హత్య చేయడం కోసం నెలల తరబడి ఆన్లైన్లో వెతకడం ప్రారంభించింది.

ఆమె 50 మంది వ్యక్తులను సంప్రదించింది. తన కూతురికి ఇంగ్లీషు పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలు కావాలని ప్రకటన ఇచ్చింది. దాంతో లైన్లోకి వచ్చిన 26 ఏళ్ల బాధితురాలిని సంప్రదించింది. తానే వచ్చి ట్యూషన్ చెప్పించుకుంటానని జంగ్ ఆమెను కోరింది. దాంతో ట్యూటర్ జంగ్ కి అడ్రస్ పంపించింది.

జంగ్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన స్కూల్ యూనిఫాం ధరించి ట్యూటర్ ఇంటికి వెళ్లింది. టీచర్ ఆమెను లోపలికి అనుమతించిన తర్వాత ఆమెపై దాడి చేసింది, 100 కంటే ఎక్కువ సార్లు కత్తితో పొడిచి, బాధితురాలు చనిపోయిన తర్వాత కూడా ఉన్మాదంగా దాడిని కొనసాగించింది. ఆ తర్వాత ఆమె ట్యూటర్ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి స్కూట్ కేస్ లో సర్ధింది. బుసాన్‌కు ఉత్తరాన ఉన్న ఒక నదికి సమీపంలోని రిమోట్ పార్క్‌ల్యాండ్‌లో పడవేసింది ట్యూటర్ శరీర భాగాలను.

రక్తంతో తడిసిన సూట్‌కేస్‌ను అడవుల్లో పడేసిన కస్టమర్‌పై టాక్సీ డ్రైవర్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమె పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జంగ్ యొక్క ఆన్‌లైన్ బ్రౌజింగ్ లో ఆమె మనిషిని ఎలా చంపాలి, ఎలా పారవేయాలి అనే దానిపై ఆమె నెలల తరబడి పరిశోధనలు చేసింది. నేరం ఎన్నాళ్లో దాగదు.. తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదు అని జంగ్ కేసు మరోసారి నిరూపించింది.

హత్య చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమె అజాగ్రత్తగా ఉంది, CCTV కెమెరాలను నివారించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు, అనేకసార్లు ట్యూటర్ ఇంటికి వెళ్లడం ఆమెతో ముచ్చటించడం వంటివన్నీ కెమెరాలో రికార్డయ్యాయి.

బుసాన్ జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారం మాట్లాడుతూ, ఈ హత్య "ఏ కారణం లేకుండా ఎవరైనా బాధితురాలిగా మారవచ్చని నిరూపితమైంది" అని అన్నారు. దక్షిణ కొరియా మరణశిక్షను కొనసాగించినప్పటికీ, 1997 నుండి ఎటువంటి ఉరిశిక్షలు జరగలేదు.

జూన్‌లో నేరాన్ని అంగీకరించిన జంగ్, ఆ సమయంలో తాను మానసిక రుగ్మతలతో బాధపడుతున్నానని పేర్కొంటూ, తేలికైన శిక్ష విధించాలని అభ్యర్థించింది. అయితే, కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చింది, నేరం "జాగ్రత్తగా ప్రణాళిక చేయబడింది. దీనిని బట్టి చూస్తే ఆమె మానసికంగా, శారీరకంగా బాగాలేదనే వాదనను అంగీకరించడం కష్టం" అని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story