Paderu: ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద మృతి..

Paderu: పాడేరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాడేరులోని ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న నవీన్ అనుమానాస్పదంగా శవమై కనిపించడం కలకలం సృష్టించింది.గెమ్మిలి పంచాయతీ సుర్లపాలెంకు చెందిన మహేంద్ర, ఇందరమ్మల కుమారుడు నవీన్ పీకపై ఉరి వేసిన అనవాళ్లు స్పష్టంగా కనిపించాయని స్థానికులు తెలిపారు
పాడేరు ఆశ్రమ పాఠశాల, సినిమా హాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకదానికొకటి అనుకుని ఉన్నాయి. ఆశ్రమ పాఠశాల కంపౌండ్ వాల్ అవతలి వైపు సినిమా హాల్‌కు దగ్గరలో ఓ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించిన కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ సుధాకర్, ఎస్సై లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విద్యార్థి ముఖం, పొట్ట, ఇతర శరీర భాగాలపై చిన్న గాయాలు ఉండటాన్ని గుర్తించి,మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నవీన్ మృతి ఘటనలో హాస్టల్ సిబ్బంది వైఖరికి నిరసనగా విద్యా సంస్థలు బంద్ పాటించాయి.
ఇక నవీన్ కంపౌండ్ వాల్ దూకే సమయంలో కిందకు జారిపడ్డాడా.. లేదా ఎవ్వరైనా బలవంతంగా తోసేశారా.. అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నవీన్ గత శుక్రవారం అనుమతి తీసుకోకుండా బయటకు వెళ్లిపోయాడని. అప్పటి నుంచి నవీన్ స్కూల్‌కు రావడం లేదని పాఠశాలకు హాజరు కాలేదన్నారు ఏటీడబ్ల్యూఓ రజని. ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com