Sunny Leone : సన్నీ లియోన్ కు నెలకు రూ. 1,000 పింఛన్

Sunny Leone : సన్నీ లియోన్ కు నెలకు రూ. 1,000 పింఛన్
X

వివాహిత మహిళల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మహాతరి మందన్ యోజన కింద ప్రతి నెలా అందిస్తున్న రూ. వెయ్యి చొప్పున పింఛన్ ను పొందుతోంది బాలీవుడ్ నటి సన్నీ లియోజన్. ఓ వ్యక్తి తన భార్య సన్నీ లియోన్ అని పేర్కొంటూ ఫేక్ ఖాతా ఓపెన్ చేసి ప్రతి నెలా రూ. వెయ్యి నొక్కేస్తున్నాడు. మొత్తానికి జమ అవుతున్న ఖాతాల్లో ఒకటి సన్నీలియోన్ పేరు మీద ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఖాతాను తెరిచి ఆపరేట్ చేసిన వ్యక్తి వీరేంద్ర జోషిగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బస్తర్ సమీపంలోగల తాలూర్ గ్రామంలో ఈ మోసం జరిగినట్టు అధికారులు గుర్తించారు. లోతుగా విచారణ జరిపి బ్యాంకు ఖాతాను సీజ్ చేసి రికవరీ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను జిల్లా కలెక్టర్ హరీస్ ఎస్ ఆదేశించారు. పథకంలో ఇలాంటి లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులపైనా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మహతారీ వందన్ యోజన కింద 50 శాతం మంది లబ్ధిదారులు నకిలీవేనని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైజ్ ఆరోపించారు. కాంగ్రెస్ గత హయాంలో అందించని ప్రతినెలా సాయం ఇప్పుడు రాష్ట్ర మహిళలు అందుకుం టున్నందున కాంగ్రెస్ కు బాధ కలుగుతోందని ఉప ముఖ్యమంత్రి అరుణ్సావో మండిపడ్డారు.

Tags

Next Story