సూర్యాపేటలో.. సుపారీ గ్యాంగ్‌

సూర్యాపేటలో.. సుపారీ గ్యాంగ్‌

సూర్యాపేట జిల్లాలో 12మంది సభ్యుల సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజ్‌ ఓనర్‌ బుడ్డే కాంతారావును నిందితులు హత్య చేసేందుకు ప్రయత్నించారు. తృటిలో తప్పించుకున్న కాంతారావు పోలీసులను ఆశ్రయించారు. సకాలంలో స్పందించిన కోదాడ పోలీసులు హత్య చేసేందుకు ప్రయత్నించిన 12మంది సుపారీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.గేట్ కాలేజ్ యజమాని బుడ్డే కాంతారావును ఆయన భాగస్వాములు కొందరు హత్య చేసేందుకు కుట్ర పన్నారు. సుపారీ గ్యాంగ్‌తో 50లక్షల డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా 5లక్షలు చెల్లించారు కాంతారావును డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టి చంపాలనేది వారి సుపారీ గ్యాంగ్ ప్లాన్. తొలుత మునగాల మండలం మద్దెల చెరువు వద్ద కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీకొట్టేందుకు సుపారీ గ్యాంగ్ ప్రయత్నించింది. అయితే అక్కడి నుంచి ఆయన తప్పించుకున్నాడు. దీంతో కోదాడ టౌన్‌లో మరోసారి డీసీఎంతో కాంతారావు కారును ఢీకొట్టారు. స్వల్ప గాయాలతో అక్కడి నుంచి పరారైన కాంతారావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. 12మంది సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్‌ చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటికొచ్చాయి. కాంతారావు కాలేజ్‌కు చెందిన కొందరు భాగస్వాములే ఈ హత్యకు కుట్ర పన్నినట్లు తేల్చారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story