డ్రగ్స్‌కి బానిసైన కొడుకు.. తండ్రిని హతమార్చి..

డ్రగ్స్‌కి బానిసైన కొడుకు.. తండ్రిని హతమార్చి..
X
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం నారాయణగూడెంలో దారుణం జరిగింది.

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం నారాయణగూడెంలో దారుణం జరిగింది. తండ్రి నంద్యాల అంజిరెడ్డిని కొడుకు అమరసింహారెడ్డి ఈరోజు తెల్లవారు జామున 3 గంటలకు బండరాయితో మోది దారుణంగా చంపాడు. లండన్‌లో కొంత కాలం ఉన్న అమర్‌ డ్రగ్స్‌కు బానిసగా మారాడు. లండన్‌ నుంచి మూడేళ్ల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చిన అమర్‌ మతిస్థిమితం కోల్పోయి శాడిస్టులా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తన భార్య చనిపోవడంతో తండ్రి అంజిరెడ్డి కొడుకు అమర్‌తో కలిసి ఉంటున్నాడు. అయితే.. డ్రగ్స్‌కు బానిస అయిన అమర్‌.. తండ్రిని దారుణంగా చంపి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Tags

Next Story