మార్చిలో పెండ్లి.. మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి

సంగారెడ్డి జిల్లాలో (Sangareddy district) ఓ మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి చెందింది. రామచంద్రాపురంలోని హెచ్ఐజీ కాలనీలో నివసిస్తున్న ప్రకాశ్ రెడ్డి కూతురు రచనా రెడ్డి(26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపుతోంది .. సోమవారం ఉదయం హాస్పిటల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి తన కారులో బయలుదేరింది. ముత్తంగి వద్ద ఆమె కారు రింగ్ రోడ్డుపైకి ఎక్కింది. కిష్టారెడ్డిపేట–సుల్తాన్పూర్ పరిధిలో ఆమె కారు రోడ్డు పక్కన రెయిలింగ్‌కు తాకి ఆగిపోయి ఉంది.
రచనా రెడ్డి అపస్మారక సిత్థిలో ఉండగా గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందిచారు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి.. ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటన్ షిప్ చేస్తుంది.
రచనా రెడ్డి కుటుంబ సభ్యులు BHELలోని HIGలో ఉంటున్నారు. అయితే.. రచనా రెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆమె స్వయంగా ఆత్మహత్య చేసుకున్నట్టయితే.. అందుకు గల కారణాలేంటీ.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా, రచనకు గత నవంబర్‌లో తనకు నచ్చిన వ్యక్తితోనే ఎంగేజ్మెంట్ జరిగిందని, వచ్చే మార్చిలో పెండ్లి జరగాల్సి ఉందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com