Crime : సతీష్ కుమార్ మృతిపై అనుమానాలు.. హత్య జరిగిందా..?

Crime : సతీష్ కుమార్ మృతిపై అనుమానాలు.. హత్య జరిగిందా..?
X

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న సీఐ సతీష్ అనుమానాస్పద మృతి ఏపీలో సంచలనంగా మారింది. పరకామణి కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ ను పట్టుకుంది ఈ సతీషే. అప్పట్లో ఆయన టీటీడీలో ఏవీఎస్ వోగా పనిచేస్తుండగా.. రవికుమార్ దొంగతనాన్ని పసిగట్టి పట్టుకున్నాడు. కోర్టులో అప్పట్లో కేసు వేయగా.. చాలా మంది నేతలు ఒత్తిడి తెచ్చి ఆ కేసును రాజీ కుదుర్చుకునేలా చేశారు. అయితే ఎవరు ఇలా రాజీ కుదుర్చుకునేలా చేశారనేది ఆయన సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వస్తుండగా ఇలా చనిపోయారు. రైలులో బయలుదేరిన సతీష్, రైల్వే ట్రాక్ వద్ద శవంగా కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది సాధారణ ప్రమాదమా, లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా.. లేదంటే హత్య చేసి ఇలా సీన్ క్రియేట్ చేశారా అన్నది ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఆయనది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టంలో ఏం తేలుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఏపీ రాజకీయాల్లో చాలా పెద్ద విషయం. ఎందుకంటే పరకామణి కేసులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయనే అనుమానాలు బయటపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో సతీష్ ను ఒత్తిడి చేసి రాజీ చేసుకునేలా చేసిన నేతల పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయన్ను ఇలా చంపేసి ఉంటారనే అనుమానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

పరకామణిలో రూ.150 కోట్లకు పైగానే ఈ రవికుమార్ అండ్ గ్యాంగ్ దోచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న టైమ్ లోనే ఇదంతా జరిగింది. సతీష్ కనీసం బోర్డుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేసను రాజీ కుదుర్చుకోవడమే పెద్ద సంచలనం. ఈ సతీష్ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సతీష్‌ ను సిట్ విచారిస్తే ఈ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయేవి. అసలు పెద్ద తలకాయలు మొత్తం బయట పడేవి. కానీ అక్కడి దాకా వెళ్లకుండానే ఇంతటి దారుణం జరిగింది. పోస్టుమార్టంలో వచ్చే నివేదికపైనే ఈయన మరణంపై క్లారిటీ రాబోతోంది.


Tags

Next Story