Swarnalatha: అవును తప్పు చేశా.. డబ్బుకోసమే నోట్ల మార్పిడి చేశా..
అవును.. తప్పు చేశా.. కేవలం డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లుగా విశాఖ సిటీ రిజర్వ్ హోంగార్డ్సు ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత పోలీసు ఉన్నతాధికారుల ముందు తెలియజేసినట్లు సమాచారం. నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4గా రిమాండ్‌లో ఉన్న స్వర్ణలతకు పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. క్రైమ్ డీసీపీ నాగన్నతోపాటు ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో ఆమెను గురువారం ఉదయం జైలు నుంచి తీసుకొచ్చి ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్‌లో విచారించారు. అయితే వివరాలను పోలీసు ఉన్నతాధికారులు సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ముందుగా విచారణకు స్వర్ణలత పూర్తిస్థాయిలో సహకరించలేదట సైలెంట్‌గా ఉండటంతో పోలీసు అధికారులు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో గట్టిగానే ప్రశ్నించారట.
విశాఖలోని ఓ నేత వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను త్వరగా మార్పిస్తే 10 శాతం కమీషన్ వస్తుందని మరో నాయకుడి ద్వారా తెలుసుకుని ఈ మోసానికి పాల్పడినట్లుగా సీఐ స్వర్ణలత ఒప్పుకున్నట్లు సమాచారం. తన వాహన డ్రైవర్ ఒత్తిడి చేయటం వల్లనే డబ్బులకు ఆశపడి వెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నగదు మార్పిడికి సంబంధించి తమ వాహనంలో ఎలాంటి 2 వేల రూపాయల నోట్లు తీసుకెళ్లలేదని, అవతల వ్యక్తుల నుంచి 500 రూపాయల నోట్లను తీసుకురావటం జరిగిందని చెప్పినట్లు సమాచారం. అటు సినిమా షూటింగ్ నిమిత్తం స్వర్ణలత నృత్య వీడియోలపై కూడా పోలీసు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
నోట్ల మార్పిడి కేసులో కొందర్ని బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఆర్మ్‌డ్ రిజర్వు ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత అరెస్టవడం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. స్వర్ణలతకు సినిమాలంటే పిచ్చ ఇంట్రస్ట్. ఆమె ఏపీ 31 సినిమాలో నటిస్తున్నారు కూడా. సినిమాలపై ఆసక్తి ఉన్న స్వర్ణలత పాటలకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు.
స్వర్ణలత నటిస్తున్న ‘ఏపీ 31’ చిత్ర నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలోనూ ఆమె భాగస్వామి అయినట్లు తెలుస్తోంది. అందుకు డబ్బుల కోసమే నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ ఆమెకు పరిచయాలున్నాయి. కమీషన్ తీసుకుని ఇలా నోట్లు మార్పిడి చేసుకోవాలని చూసేవారికి కొన్ని ప్లాట్లు కూడా ఆమె బుక్ చేశారన్న ఆరోపణలున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com