పెనుమాదంలో తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్య

పెనుమాదంలో తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమాదంలో గ్రామ పెద్దలు మందలించడంతో తెలుగుదేశం కార్యకర్త శ్రీనుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు.

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమాదంలో గ్రామ పెద్దలు మందలించడంతో తెలుగుదేశం కార్యకర్త శ్రీనుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ నాయకులు వేధింపుల వల్లే శ్రీనుబాబు ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు.

కొన్నేళ్లుగా శ్రీనుబాబు ప్రభుత్వ రిజర్వ్ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇస్తుండటంతో తాను ఎన్నో ఏళ్లుగా ఉంటున్న స్థలానికి పట్టా ఇవ్వాలని అధికారులను కోరడంతో రిజర్వ్ స్థలానికి పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారు.

అనర్హులకు ఇండ్ల పట్టాలు ఇస్తున్నారని... అర్హుడైన తనకు పట్టా ఇవ్వడం లేదని శ్రీనుబాబు కోర్టును ఆశ్రయించాడు. శ్రీనుబాబుకు స్థల పట్టా ఇవ్వాలని, అలాగే అనర్హులకు కాకుండా అర్హులైన వారికి ఇండ్ల స్థలం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

శ్రీనుబాబు వల్ల గ్రామంలో చాలామందికి పట్టాలు ఆగిపోతున్నాయని అధికారులు చెప్పడంతో గ్రామపెద్దలు శ్రీనుబాబును పిలిచి మందలించారు. శ్రీనుబాబు మనస్తాపంతో పురుగులు మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు.

శ్రీనుబాబు తెలుగుదేశం కార్యకర్త అనే కారణంతోనే... అధికారులు పట్టా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వేధింపులు తట్టుకోలేకనే శ్రీనుబాబు అనే వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story