Adilabad : లైంగిక వేధింపులు... టీచర్ జైలుపాలు

Adilabad : లైంగిక వేధింపులు... టీచర్ జైలుపాలు
X

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పక్షం రోజుల కిందటే ఆశ్రమ పాఠశాల విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఘటన మరువకముందే ఆదిలాబాద్ జిల్లాలో మరో పీఈటీ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఆదిలాబాద్ జిల్లా మావల జడ్పీహెచ్ఎస్ పాఠ శాలలో పీఈటీగా పనిచేస్తున్న గుండ మహేష్ అనే టీచర్ కొన్ని రోజులుగా హైస్కూల్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశారని బాలికలు షీ టీమ్కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆ స్కూల్లో పనిచేసే యోగా టీ చర్ పట్ల అనుచితంగా, అసభ్యకరంగా వేధించారని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సీ మహాజన్ నిందితుడు పీఈటీ టీచర్ గుండి మహేప్పై ఫోక్సో కేసులతోపాటు వేధింపుల ఫిర్యాదుపై రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్పీ అఖిల్ మహజాన్ వివరించారు.

Tags

Next Story