karnataka : పది మంది గంజాయి ముఠా అరెస్ట్ ..1.709 కిలోల గంజాయి స్వాధీనం

karnataka : పది మంది గంజాయి ముఠా అరెస్ట్ ..1.709 కిలోల గంజాయి స్వాధీనం
X

కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నగరంలో కొనుగోలు చేసి గంజాయిని అమ్మేందుకు తీసుకెళ్తున్న 10 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా రాయదుర్గం అర్బన్ సిఐ j. జయ నాయక్ తెలిపారు. బళ్లారి లోని రైల్వే స్టేషన్ తో పాటు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సాధువుల నుంచి గంజాయి కొనుగోలు చేసి వాటిని ప్యాకెట్లుగా మార్చి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో ఒక ప్యాకెట్ రూ. 800 లకు అమ్ముతున్నట్లు నిందితుల విచారణలో తేలిందని చెప్పారు. ఇప్పటి వరకు రైలు మార్గంలో తరలించే ముఠా సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని కనేకల్ రోడ్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి ముఠా సభ్యులు పోలీసులకు అనుమానం రాగా పట్టుబడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలని దురాశతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కంబదూరు మండలం కర్తనపర్తికి చెందిన బోయ నరేష్, కొత్తూరు కు చెందిన కొడపల్లి రామాంజనేయులు, చెన్నంపల్లి కి చెందిన వై మారెన్న, ఆత్మకూరు మండలం తోపుదుర్తి కి చెందిన ముదిగుబ్బ సి మారెప్ప, కంటగాని వెంకటరాముడు, అనంతపురం నగరం లోని చంద్రబాబు కొట్టాలకు చెందిన దంపట్ల జీవన్ కుమార్, రుద్రంపేటకు చెందిన బండి ఉదయ్ కిరణ్, ఎస్టి కాలనీకి చెందిన అమాం సాబ్, రాణి నగర్ కు చెందిన అన్వర్ భాష, గార్లదిన్నె మండలం పాతకల్లు గ్రామానికి చెందిన అంచెల రసూల్ ఖాన్ లు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులతో పాటు 1.709 కిలోల గంజాయి, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు రాయదుర్గం అర్బన్ సిఐ జయ నాయక్ వివరించారు.

Tags

Next Story