TG : ప్రియురాలిని కిరాతంగా హత్య చేసిన ప్రియుడు

TG : ప్రియురాలిని కిరాతంగా హత్య చేసిన ప్రియుడు
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినపేట తండాలో దారుణం జరిగింది. ప్రియురాలు స్వాతి (32)ని అత్యంత కిరాతకంగా చంపిన ప్రియుడు బానోత్ వీరభద్రం తన పొలంలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. యువతి కనిపించకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసుకుని.. వీరభద్రాన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. స్వాతిని 20 ముక్కలుగా నరికి.. గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టిన ట్లు గుర్తించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్, తహసీల్దార్ స్వాతి బిందు, సీఐ ఇంద్రసేన రెడ్డి ఘటనా పరిశీలించి, డెడ్ బాడీని బయటకు తీశారు. గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన ఓ జంటకు.. సింగరేణిలో ఉద్యోగా లిప్పిస్తామని స్వాతి నమ్మబలికింది. వాళ్ల దగ్గరి నుంచి రూ.16 లక్షల దాకా వసూలు చేసి వీరభద్రం చేతికి అప్పగించింది. అయితే ఎంతకీ వాళ్ల నుంచి బదులు లేకపోవడంతో ఆ భార్యభర్తలు పోలీసులను ఆశ్రయించా రు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు చివరకు ఆత్మహత్య చేసుకున్నా. రు. దీంతో.. ఆ డబ్బు మొత్తం తానే అనుభవిం చాలనే ఉద్దేశంతో స్వాతిని చంపినట్లు వీరభ ద్రం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది

Tags

Next Story