స్కూటీని ఢీకొట్టిన బస్సు.. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి

స్కూటీని ఢీకొట్టిన బస్సు.. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
ప్రమాదం ఎటు నుంచి ముంచుకు వస్తుందో, ప్రాణాలు ఎలా పోతాయో ఎవరికీ తెలియదు..

ప్రమాదం ఎటు నుంచి ముంచుకు వస్తుందో, ప్రాణాలు ఎలా పోతాయో ఎవరికీ తెలియదు.. కాలేజీకి వెళుతున్న ఓ విద్యార్ధిని బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మల్లేశ్వరం ప్రాంతంలో కళాశాలకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా బీఎంటీసీ బస్సు ఢీకొని మృతి చెందింది.

21 ఏళ్ల విద్యార్థిని కుసుమితను బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సు ఢీకొట్టింది. వెంటనే అక్కడ ఉన్నవారంతా అప్రమత్తమై బస్సును ఆపేశారు. బస్సు చక్రాల క్రింద నలిగిపోయిన విద్యార్ధిని బయటకు తీశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story