Medchal District : కన్న తండ్రిని చంపిన కూతురు.. కారణం తెలిస్తే షాకవుతారు..

అక్రమ సంబంధాలు మనుషులు ప్రాణాలు తీస్తున్నాయి. తమ సంబంధానికి అడ్డొస్తే భర్త, తండ్రి అని కూడా మహిళలు చూడడం లేదు. హత్య చేసి చివరకు కటకటాల పాలవుతున్నారు. మేడ్చల్ జిల్లాలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్నతండ్రిని ప్రియుడు, తల్లితో కలిసి కూతురు హత్య చేసింది. ఆ తర్వాత హాయిగా సెకండ్ షో సినిమాకు వెళ్లారు. సినిమా నుంచి వచ్చాక శవాన్ని క్యాబ్‌లో తీసుకెళ్లి చెరువులో పడేశారు. ఎదులాబాద్ చెరువులో ఈనెల 7న ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఒంటిపై గాయాలుండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడిని హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగంగా గుర్తించారు. ఆయనకు కల్లుతాగే అలవాటు ఉందని, అందరితో గొడవ పడేవాడని భార్య శారద, కూతురు మనీషా చెప్పారు. ఈనెల 6న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేడని పోలీసులకు చెప్పారు. అయితే వారి మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు చెరువు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కల్లు తాగాడని క్యాబ్ డ్రైవర్‌ను నమ్మించి..
లింగం పాతబస్తీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు.. భార్య జీహెచ్‌ఎంసీలో స్వీపర్ కాగా.. పెద్ద కూతురు మనీషాకు వివాహమైంది. మనీషాకు భర్త ఫ్రెండ్ అయిన మహ్మద్ జావీద్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమెను భర్త వదిలివేశాడు. అయితే ఆమె ప్రియుడితో కలిసి మౌలాలీలో అద్దె ఇంట్లో ఉంటోంది. కూతురు వేరే వ్యక్తితో కలిసి ఉండడం నచ్చని లింగం ఆమెతో పలుమార్లు గొడవ పడ్డాడు. తనకు కూడా ఇతరులతో వివాహేతర బంధాలున్నాయని అనుమానిస్తూ వేధిస్తున్నాడని తల్లి శారద కూతురితో చెప్పింది. ఈ క్రమంలో తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈనెల 5న కల్లులో నిద్ర మాత్రలు కలిపిచ్చి.. నిద్రలోకి జారుకున్నాక.. లింగం ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని క్యాబ్ లో ఎదులాబాద్ తీసుకెళ్లి చెరువులో పడేశారు. క్యాబ్ డ్రైవర్ అడిగితే కల్లు తాగి పడిపోయాడని చెప్పి నమ్మించారు. ముగ్గిరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com