Actress Seetha : నటి సీత ఇంట్లో చోరీ

Actress Seetha : నటి సీత ఇంట్లో చోరీ
X

నటి సీత ఇంట్లో చోరీ జరిగింది. తన ఇంట్లో రెండున్నర సవర్ల నగలు మాయమైనట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్భవం అనే తమిళ మూవీతో తెరగ్రేటం చేసింది. రజనీకాంత్, విజయకాంత్ లాంటి ఎంతో మంది స్టార్స్ తో కలిసి నటించింది. కోలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకుంది. భర్త పార్థిబన్ తో విడాకులు తీసుకుని నటుడు సతీష్ ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఆయనతోనూ విడిపోయింది. ప్రస్తుతం విరుగంబాక్కంలోని పుష్పకాలనీలో ఉంటున్నారు. తాజాగా తన ఇంట్లో ఉంచిన రెండున్నర సవర్ల బంగారు నగలు కనిపించడంలేదని విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన వారు, ఇంట్లో పనిచేసే వారు దానిని తీసుకెళ్లి ఉంటారని సీత ఫిర్యాదు చేసింది. ఈమె తెలుగులోనూ ఎన్నో సినిమాలు చేశారు.

Tags

Next Story