TG : హయత్ నగర్ లో సీజ్ చేసిన ఇంట్లో చోరీ.. నగలు నగలు మాయం

TG : హయత్ నగర్ లో సీజ్ చేసిన ఇంట్లో చోరీ.. నగలు నగలు మాయం
X

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ సీజ్‌ చేసిన ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు 3లక్షల నగదు, 7 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి చోరీకి గురైంది. ఇంటి లోను చెల్లించకపోవడతో లీగల్‌గా ఇంటిని సీజ్‌ చేసి..ఇంటికి లీగల్‌ నోటీసులు అంటించారు. ఇంటి వాల్యుయేషన్‌ వేయడం కోసం ఫైనాన్స్‌ ఉద్యోగులు రాగా..ఇంటి తాలాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్దకు చేరుకున్న ఇంటి యజమాని తమ సొమ్ము అపహరణకు గురైందని..న్యాయం చేయాలని పోలుసులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story