Crime News : జుట్టు పట్టి లాక్కెళ్లి...బట్టలు చించి దాడి...నెల్లూరు లో ట్రాన్స్‌జెండర్ల వీరంగం..

నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కందుకూరులో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే... ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళిన ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు, అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సును డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఆమె వారు అడిగినంత ఇవ్వకపోవడంతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫైల్స్‌ను కింద పడేసి బీభత్సం సృష్టించారు. నర్సు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వారు ఆమె వెంటపడి దాడి చేశారు. జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లి మరీ కొట్టారు. ఆమె దుస్తులను చింపేసి అమానుషంగా ప్రవర్తించారు. ఈ దారుణ దృశ్యాలన్నీ ఆస్పత్రిలోని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వారి ఆగడాలు పెరిగిపోయాయని, స్థానికులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com