Nellore: పెన్షన్ డబ్బులపై దొంగల కన్ను.. పక్కా ప్లాన్‌తో రూ.లక్షా 55 వేలు చోరీ..

Nellore: పెన్షన్ డబ్బులపై దొంగల కన్ను.. పక్కా ప్లాన్‌తో రూ.లక్షా 55 వేలు చోరీ..
Nellore: బిట్రగుంట నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్‌ డబ్బులు తీసుకుని బైక్‌పై వెళ్తుండగా మధ్యలో ఇద్దరు వ్యక్తులు అటకాయించారు.

Nellore: వృద్ధులకు పెన్షన్లు పంచేందుకు బ్యాంక్‌ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న వెల్ఫేర్‌ అసిస్టెంట్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి లక్షా 55 వేలు ఎత్తుకెళ్లారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో ఈ ఘటన జరిగింది. బిట్రగుంట SBI నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్‌ హరిబాబు డబ్బులు తీసుకుని బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో ఇద్దరు వ్యక్తులు అటకాయించారు. అతన్ని కొట్టి డబ్బులు లాక్కుని పరారయ్యారు. దీనిపై కప్పరాళ్లతిప్ప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సచివాలయ ఉద్యోగి ఇచ్చిన సమాచారం ఆధారంగా CC ఫుటేజ్‌ పరిశీలిస్తున్న పోలీసులు.. నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story