TG : డ్రగ్స్‌ విక్రయిస్తూ ముగ్గురు అరెస్ట్

TG : డ్రగ్స్‌ విక్రయిస్తూ ముగ్గురు అరెస్ట్
X

అక్రమంగా డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబందించి సీఐ కృష్ణంరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన సురేష్‌కుమార్‌, దినేష్‌కుమార్‌, సునీల్‌కుమార్‌ గత కొంతకాలంగా నగరంలోని నాదర్‌గుల్‌లో నివాసముంటున్నారు. నిషేదిత డ్రగ్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలను గడిస్తున్నారు.హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కందుకూరు మండలం బేగరికంచె సమీపంలోని అమెజాన్‌ కంపెనీలో పనిచేస్తున్న లేబర్‌కు ముగ్గురు యువకులు డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ముగ్గరిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా డ్రగ్స్‌ సరఫరా చేసినా, విక్రయించినా, స్వీకరించినా క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Tags

Next Story