టిక్‌టాక్ కపుల్స్‌.. 44 లక్షలు వసూలు.. వెలుగులోకి ఘరానా మోసం..!

టిక్‌టాక్ కపుల్స్‌.. 44 లక్షలు వసూలు.. వెలుగులోకి ఘరానా మోసం..!
చదువు, వ్యాపారాలకు లోన్లు ఇప్పిస్తామంటూ మోసం చేసే దంపతులను రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు.

చదువు, వ్యాపారాలకు లోన్లు ఇప్పిస్తామంటూ మోసం చేసే దంపతులను రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గోకవరం మండలానికి చెందిన శ్రీధర్, గాయత్రిల మోసాలు వెలుగులోకి వచ్చాయి. వీరు టిక్‌టాక్ కపుల్స్‌గా గ్రామంలో గుర్తింపు పొందారు. విదేశాల్లో తమ కూతురిని చదివించాలని.. ఏలూరుకు చెందిన గౌరీశంకర్ అనే వ్యక్తి నుండి 44 లక్షలు వసూలు చేశారు. అలాగే రైస్ మిల్లుకు లోన్ ఇప్పిస్తానని నలుగురి నుంచి 3 లక్షలు వసూలు చేశారు. డబ్బులు అడిగినా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో శ్రీధర్, గాయత్రిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 15 రోజులు రిమాండ్ విధించడంతో.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story