Bihar : బిహార్‌లో ఘోరం.. పవిత్ర స్నానాలు చేస్తూ 46 మంది మృతి

బిహార్లో 'జివిత్ పుత్రిక(జితియా)' పండగ సామాన్యుల జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది. పండుగలో భాగంగా వేరువేరు ప్రాంతాల్లోని నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగి ఏకంగా 46 మంది చనిపోయారు. మృతుల్లో 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు ఉన్నారు.
జితియా పండుగ సందర్భంగా తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉంటారు. దీర్ఘాయుష్షు కోరుతూ పిల్లలతో కలిసి సమీపంలోని నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ 46 మంది చనిపోయారు. ఈస్ట్ అండ్ వెస్ట్ చంపారన్, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్పూర్, సమస్తిపూర్, గోపాల్గంజ్, అర్వాల్ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. సరైన జాగ్రత్తలు లేని ప్రాంతాల్లో స్నానాలు ఆచరించిన కారణంగా పిల్లలు నీళ్లలో మునిగిపోయి చనిపోయారని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com