విరిగిపడ్డ కొండచరియలు.. సజీవంగా 54 మంది సమాధి

పిలిప్పీన్స్‌లో (Phillipine) దారుణం జరిగింది. డావో ప్రావిన్సు మాకో టౌన్‌లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 54 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 32 మంది గాయపడ్డారు.
కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి. ఫిబ్రవరి 11, 2024 ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మూడు వందల మందితో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేస్తోంది. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, బురద వల్ల రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ కొండ చరియలు విరిగియ పడే అవకాశాలుండటంతో సహాయక సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొండ చరియలు విరిగిపడ్డప్పటి నుంచి మొత్తం 63 మంది ఆజూకీ తెలియడం లేదు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు తేల్చిచెప్పారు. శిథిలాల తొలగింపు.. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com