సిలిండర్ పేలి ఏడుగురికి గాయాలు

సిలిండర్ పేలి ఏడుగురికి గాయాలు

పంజాబ్‌లోని లూథియానా శివార్లలోని కంగన్‌వాల్ గ్రామంలో ఎల్‌పీజీ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ విషాద సంఘటనలో ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాలిన గాయాలైన వారిని సాహిల్ (10), సాక్షి (11), పవన్ కుమార్ (29)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ముగ్గురిని మాత్రమే గాయపడినట్టు గుర్తించామని వారు తెలిపారు.

ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారందరినీ స్థానిక సివిల్ ఆసుపత్రిలో చేర్చారని, తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను చికిత్స కోసం పిజిఐ చండీగఢ్‌కు రిఫర్ చేసినట్లు చెప్పారు. లూథియానా-ఢిల్లీ జాతీయ రహదారిపై ఎల్‌పిజి సిలిండర్ పేలిన ఘటనలో చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఈ రోజు తెల్లవారుజామున సరస్వతి పూజ జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించిందని సాహ్నేవాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ గుల్జీందర్ పాల్ మీడియాతో అన్నారు. పేలుడు ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, వలస కూలీల కుటుంబాలు నివసించే ఈ ప్రాంతంలోని గోడలకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. స్థానికులు సుదీర్ఘ పోరాటం తర్వాత మంటలను అదుపు చేసి, ఆర్పివేశారని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story