Mobile Charger : చిన్నారి ప్రాణం తీసిన సెల్ ఫోన్

Mobile Charger : చిన్నారి ప్రాణం తీసిన సెల్ ఫోన్
X

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన కటికాల అంజలి

కార్తీక (8) 4వ తరగతి చదువుతోంది. ప్రతీరోజు స్కూల్ నుంచి రాగానే తండ్రి సెల్ ఫోన్ తో ఆడుకునేది.

శుక్రవారం తండ్రి ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్లడంతో ఆడుకుందామని తడి చేతులతో ఛార్జింగ్ వైర్ పట్టుకోవడంతో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు

మేరకు చింతకాని ఎస్ఐ నాగుల్ మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Tags

Next Story