మెగా చర్చిలో మహిళ కాల్పులు, ఇద్దరికి గాయాలు

మెగా చర్చిలో మహిళ కాల్పులు, ఇద్దరికి గాయాలు

టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఫిబ్రవరి 11న ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు జోయెల్ ఓస్టీన్ నిర్వహిస్తున్న మెగా చర్చ్‌పై కాల్పులు జరిపి ఒక మహిళ మరణించినట్లు నగర పోలీసు చీఫ్ తెలిపారు. సూపర్ బౌల్ LVIII కోసం USలోని మెజారిటీ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూసిన రోజున ఈ సంఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం, ఒక మహి పొడవాటి ట్రెంచ్ కోటు ధరించి, పొడవాటి రైఫిల్, బ్యాక్‌ప్యాక్‌తో చర్చిలోకి ప్రవేశించింది. ఆమెతో పాటు ఐదేళ్ల వయస్సు బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఇద్దరిపై కాల్పులు జరిపారు. వీరిలో దాదాపు ఐదేళ్ల వయసున్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉండగా, తుంటి భాగంలో కాల్చిన 57 ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు నగర పోలీసు చీఫ్ ట్రాయ్ ఫిన్నెర్ల్ తెలిపారు.

మధ్యాహ్నం 1.50 గంటలకు కాల్పులు జరగ్గా.. చర్చి వద్ద ఉన్న ఇద్దరు ఆఫ్ డ్యూటీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తమ తుపాకీలతో ఆమెకు ఎదురుతిరిగారు. ఈ కాల్పుల్లో మహిళ మృతి చెందింది. అయితే ఆ మహిళ ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు.

Tags

Next Story