TG : పటాన్ చెరులో దారుణం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి సూసైడ్

TG : పటాన్ చెరులో దారుణం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి సూసైడ్
X

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. సదాశివపేట మండలం ఆత్మకూరుకు చెందిన సుధాకర్‌, భార్య సావిత్రి దంపతులకు ముగ్గురు పిల్లలు జశ్వంత్(5), కవలలు చిన్నయి(3), చిత్రనాథ్​(3) ఉన్నారు. సుధాకర్ భార్యాపిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామానికి వచ్చి మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై సుధాకర్ కొంతకాలంగా ఇంటిని పట్టించుకోవడం లేదు. అతడి రెండు కిడ్నీలు పాడైపోవడం, ఇంటిని పట్టించుకోకపోవడంతో భార్య సావిత్రి మనస్తాపానికి గురైంది. ఆదివారం ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story