TG : సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన

TG : సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన
X

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాటిచెట్టుపై ఉరేసుకొని ఓ గీత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని కిందకి దించుతుండగా మరో ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురానికి చెందిన వెంకటేశం(75) రోజులాగే కల్లు తీయడానికి గ్రామశివారుకి వెళ్లారు. ఈ క్రమంలోనే తాటి చెట్టు ఎక్కి ఉరేసుకున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తులో వెంకటేశం చెట్టుకు వేలాడుతూ ఉండగా.. పోలీసుల సమక్షంలో అతడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. డెడ్‌బాడీని తాడు సాయంతో కిందకు దించుతుండగా.. అనూహ్యంగా తాడు తెగిపోయింది. దీంతో చెట్టుపై నాగార్జున అనే వ్యక్తిపై మృతదేహం పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగార్జున పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తన భార్య మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో పాటు ఆర్థిక, అనారోగ్య సమస్యలతోనే వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Next Story