Son Kills Mother : ఘోరం.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు తల్లినే చంపేశాడు

విశాఖ మల్కాపురంలో దారుణ ఘటన జరిగింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన బీటెక్ చదువుతున్న యువకుడు తల్లినే హతమార్చాడు. చదువుపై దృష్టిసారించాలని, గేమ్స్ ఆడొద్దని తల్లి అల్కాసింగ్ చెప్పడమే అతని కోపానికి కారణమైంది. రాడ్డుతో ఇష్టారీతిన కొట్టడంతో ఆమె చనిపోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్కాసింగ్ భర్త నేవీ అధికారిగా పనిచేస్తున్నారు. ఇటీవలే ముంబై నుంచి విశాఖకు బదిలీ అయ్యారు.
విశాఖపట్నంలో నేవీ ఉద్యోగి ఆత్మహత్య కలకలంరేపింది. జీవీఎంసీ నాల్గోవార్డు పరిధి కాపులుప్పాడ జగనన్న కాలనీలో.. తాను అద్దెకు నివాసం ఉంటున్న ఇంటి గదిలోనే సిరుమళ్ల సంతోష్ ప్రాణాలు తీసుకున్నాడు. గాజువాక సమీపంలోని శ్రీహరిపురానికి చెందిన అచ్చియ్మమ్మ, సూరిబాబులు దోబీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. వీరి కుమారుడైన సంతోష్‌కు నాలుగేళ్ల క్రితం భీమిలి మండలం ఐఎన్‌ఎస్ కళింగలో మల్టీ టాస్కింగు స్టాఫ్ (ఎంటీఎస్)గా ఉద్యోగం వచ్చింది. గాజువాక నుంచి రోజూ ఉద్యగానికి వెళ్లేందుకు దూరం కావడంతో సంతోష్ చినవాల్తేరులో ఉండే తన అక్క దివ్య ఇంటి నుంచి బైక్‌పై ఉద్యోగానికి వెళ్లి వచ్చేవాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com