Road Accident : మెట్ పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. హోం గార్డ్ మృతి

Road Accident : మెట్ పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. హోం గార్డ్ మృతి
X

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్న సుబ్బరాజు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం సుబ్బరాజు టిఫిన్‌ తీసుకురావడానికి బైక్‌ పై బయటకు వచ్చారు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి వరంగల్ వెళుతున్న ఆర్టీసీ బస్సు మెట్ పల్లి పట్టణ శివారులో హోంగార్డు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు . అక్కడికి చేరుకున్న పోలీసులు హోంగార్డు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ,ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.

Tags

Next Story